శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజేవాయుపుత్రం భజేవాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్ర రూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రము న్నీ నామ సంకీర్తనల్ చేసి, నీరూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిం జేయ నూహించి నీమూర్తి గావించి నీ సుందరంబెంచి నీదాసదాసానుదాసుండనై రామ భక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీకటాక్షంబునన్ జూచితే వేడుకల్ జేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గరన్ నిల్చితే తొల్లి సుగ్రీవుసన్మంత్రివై స్వామికార్యంబు నందుండి శ్రీరామ సౌమిత్రులం జూచి వారి న్విచారించి సర్వేశు బూజుంచి యబ్భానుజుం బంటు గావించి యవ్వాలినింజంపి కాకుత్థ్సవీరుం దయాదృష్టి వీక్షించి కిష్కింద కేతెంచి శ్రీరామకార్యార్థమై లంక కేతెంచియున్ లంకిణిన్ జంపియున్ లంకయున్ గాల్చియున్ భూమిజం జూచి యానంద ముప్పొంగ నాయుంగరం బిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీరాము కున్నిచ్చి సంతోషునిన్ జేసి సుగ్రీవుడున్ అంగదున్ జాంబ వంతాది నీలాదులం గూడీ యాసేతువున్ దాటి యావానరుల్ మూక పెన్మూకలై దైత్యులం ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండునై కోరి బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వేసి యాలక్ష్మణున్ మూర్ఛ నొందింపగా నప్పుడేపోయి సంజీవినిందెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షించగా కుంభకర్ణాది వీరాళితో బోరి చెండాడి శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమైయుండ నవ్వేళ యన్వి భీషణు న్వేడుకన్ దెచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతా మహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి యయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న నాకెవ్వరుం గూర్మి లేరంచు మన్నించినన్ రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామసంకీర్తనల్టేసినన్ పాపముల్బాయులే భీతులు స్దిరులే భాగ్యముల్ గల్గులే సకల సామ్రాజ్యము సృకల సంపత్తులుం గల్గునే వానరాకార యోభక్తమందార యపుణ్య సంచార యోధీర యోవీర! సర్వంబు నీవే గదా! తారక బ్రహ్మమంత్రంబు భావించుచున్’ వజ్ర దేహంబునుం దాల్చి శ్రీరామ శ్రీరామ శ్రీరామ యంచున్| మనః ప్రీతిగా జిహ్వకుం జేర్చి చింతించు నిన్నున్ సదా భక్తితో గొల్తు నా జిహ్వపై నిల్చినన్నుం గటాక్షింపుమో వానరశ్రేష్ఠ! త్రైలోక్యసంచారివై రామ నామాక్షర ధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్ర రూపంబుతో వచ్చి భూతాది వర్గంబులన్ శాకినీ డాకినీ ప్రేత సంఘంబులన్ గాలి దయ్యంబులన్ నీదు వాలంబునం జుట్టి నేలం బడం గొట్టి నీ ముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్ ఖండ ఖండబులం జేసి కాలాగ్ని రుద్రుండవై లోకముల్ గాతువే, బ్రహ్మతేజః ప్రభాభాసితంబైన రూపంబునుం జూచి సంతోష చిత్తుండనై రమ్ము రమ్మోయి నాముద్దు వీరాంజనేయాయటంచున్| స్తుతింపంగ గాంక్షించెదన్, నీ దయాదృష్టి వీక్షించి నన్నేలు నాసామి! యోరామ భక్తా! సదా బ్రహ్మచారీ! నమో వాయుపుత్రా నమస్తే నమస్తే నమస్తే నమః.

Similar Posts