మూత తెరిస్తే, ముత్యాల పేరు?
సమాధానం :
దంతాలు

అంగట్లో అష్టభాగ్యం, అల్లునినోట్లో శనేశ్వరం.
అంగట్లో అరువు, తలమీద బరువు.
అందనిపూలు దేవునికి అర్పణ.
అంగట్లో అన్నీ ఉన్నా అల్లునినోట్లో శని ఉన్నది.
అంకెలోనికోతి లంకంతా చెఱిచిందట.
అంకెకురాని ఆలు, కీలెడలిన కాలు.
అందనిమావిపండ్లకు ఆశపడ్డట్లు.
అక్కరకు రాని ఆలిని, ఆర్గురు బిడ్డలతల్లి అయినా విడవాలి.
అంకె అయితే గొంగెడు తెమ్మన్నానుగాని, మంచె గుంజలపాలు కమ్మన్నానా.
అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత.
అందరికి నేను లోకువ, నాకు నంబిరామయ లోకువ.
అంతకుట్టూ వస్తుంది గాని, అక్షంత కుట్టు రాదు: తీర్పుకుట్టు వస్తుందిగాని, దిబ్బ కుట్టురాదు.
అంతకుఇంతయింది, ఇంత ఎంతవుతుందో, ఇంత కింతే.
అంతఃపురము బ్రతుక్కు ఆకాశమే కావాలి.
అందరికీ శకునము చెప్పే బల్లి, కుడితి తొట్టిలో పడ్డటు.
అంతురిమీ ఇంతేనా కురిసేది.
అంతంతవాణ్ణి చూస్తే ఆవు పెయ్యే కుమ్మ వస్తుంది.
అంతంత కోడికి అర్థసేరు మసాలా.
అందరూ అందలము ఎక్కితే మోసేవారు ఎవరు.
అండలేని ఊళ్ళోఉండ దోషం, ఆశలేని పుట్టింట అడుగ దోషం.
అండఉంటే కొండలు దాటవచ్చు.
అంటే ఆరడి అవుతుంది, అనకుంటే అలుసవుతుంది.
అందానికి రెండు బొందలు, ఆటకు రెండు తాళాలు.
అంటుబొడ్డు ఆవు తల ఎద్దుకూ, జారుబొడ్డు చనుకట్టు ఆవుకూ మంచివి.
అంటుకోను ఆముదము లేకుంటే మీసాలకు సంపెంగినూనె.
అంటనప్పుడు ఆముదము రాసుకొన్నా అంటదు.
అకటవికటపురాజుకు అవివేకి ప్రధాని, చాదస్తపు పరివారము.