• మనిషి అల్పజీవి, మట్టి చిరంజీవి.
  • తగు ప్రయత్నం లేకుండా మృగరాజుకు కూడా ఆహారం దొరకదు.
  • మానవుడు పుట్టిన మరుక్షణం నుండి మరణం వైపు పయనిస్తాడు.
  • ఆవేశం తప్పుదారి పట్టిస్తుంది. ఆలోచన మంచి దారికి మళ్ళిస్తుంది.
  • బంగారంలో ప్రతి ముక్కకు విలువుంది. అలాగే…. జీవితంలో ప్రతి క్షణానికి విలువుంది.
  • మంచికి మరణం లేదు.
  • జీవితం సమస్యల సమాహారం. పరిష్కరించుకోగలిగితే! అది మణిహారం.
  • అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ. కాని – ఆయువు తక్కువ.
  • కార్య సాధకుడు కృషితో విజయం సాధిస్తాడు. సోమరి ఆ ఘనతను అదృష్టానికి అంటగడతాడు.
  • ఆలోచన లేని వాడికి అభివృద్ధి వుండదు.
  • కీలు లేని కాలు నడకకు పనికి రానట్లే! క్రమశిక్షణ లేని వ్యక్తి దేనికి పనికిరాడు.
  • “నా జీవితమే నా సందేశం” అన్నాడు. ప్రపంచానికే మహాత్ముడైన గాంధీజీ.
  • మాట ఇవ్వడానికి తొందర పదకు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆరాటపడు.
  • శ్రద్ధ ఉంటే ఓటమి ఉండదు.
  • దుఃఖ జీవులకు చేసే సేవయే! భగవద్భక్తి.
  • మంచి పనిని తక్షణం చేయాలి.
  • అపకారానికి ఉపకారం ప్రతిష్టను పెంచుతుంది.
  • విశ్వాసం హిమాలయం వంటిది.
  • మరణిస్తూ కూడా సంతోషంగా ఉండేవాడు గొప్ప పరాక్రమశాలి.
  • తక్కువ తిను, ఎక్కువ జీవించు.
  • వృద్ధాప్యానికి పలకరింపు ఒక కానుక, కనికరింపు ఒక వేడుక.
  • ప్రార్ధించే పెదవుల కన్నా, సేవ చేసే చేతులే మిన్న.
  • మనసును జయించినవారు జగత్తునే జయించగలరు.
  • ధర్మాన్ని కాపాడు. ఆ ధర్మం తప్పక నిన్ను కాపాడుతుంది.
  • న్యాయానికి చావులేదు. ధర్మమే శాశ్వతం.
  • కారు నడిపేది డ్రైవరు, మనిషిని నడిపేది మనస్సు.
  • మర్రిచెట్టు మొత్తం చిన్న విత్తనంలోనే ఇమిడి యుంటుంది.
  • అగ్గిపెట్టిలోని నిప్పు, జేబులో ఉన్నా కాల్చదు.
  • పుట్టుకను ఎంత ప్రేమిస్తామో! చావును కూడా అంతే ప్రేమించాలి.
  • జీవిత మాధుర్యాన్ని చవి చూడాలంటే! గతాన్ని మర్చిపోయే శక్తి ఉండాలి.
  • ఆపదలో సైతం ధర్మాన్ని వీడని వాడే! శ్రేష్టమైన మనిషి.
  • నైతిక విలువలు పాటిస్తే! సమాజం స్వర్గధామం.
  • మానవత్వమే – నిజమైన మతం.
  • మతాలు రెండే – అవి మంచి, చెడులు.
  • ద్వేషించే వారిని సైతం దీవించు.
  • పల్లె – తల్లి లాంటిది. పట్నం – ప్రేయసి లాంటిది.
  • దీన జన సేవ – పరమేశ్వర సేవగా భావించాలి.
  • నేడు నీవు చేస్తున్న దాన ధర్మాలు – రేపటి నీ భవిష్యత్తుకు విత్తనాలు.
  • అన్నీ ఉండి ఇతరులకు సేవ చేయలేని వారు నిజమైన అనాధలు.
  • పనికి మించిన దేవుడు లేడు.
  • దాత యొక్క సామాను గది ఎప్పుడూ ఖాళీగా వుండదన్నది దివ్య సూత్రం.
  • ప్రపంచంలో కల్తీ లేనివి, అమ్మ పాలు – అమ్మ ప్రేమ మాత్రమే!
  • సంకల్ప సిద్ధి వుంటే! సిద్ధి తానంతటదే ప్రాప్తిస్తుంది.

Similar Posts