శ్రీ రమణ మహర్షి తెలుగు సూక్తులు Ramana maharshi Quotes, ramana maharshi teachings Telugu, ramana maharshi telu sukthulu

“భగవంతునికి నీవు ఎంత దూరంలో వుంటే, భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు.
-శ్రీ భగవాన్ రమణ మహర్షి””

నుగ్రహం ఎల్లప్పుడూ ఉంది. కావల్సిందల్లా దానికి శరణాగతి చేయడమే
-శ్రీ భగవాన్ రమణ మహర్షి””

నీ సహజస్థితిలో ఉండు
-శ్రీ భగవాన్ రమణ మహర్షి””

ది తప్పనీ, అది ఒప్పనీ విమర్శించవద్దు. విమర్శల వల్ల ఎవ్వరూ బాగుపడరు.
నీవు గాఢ నిద్రలో ఉన్నప్పుడు తప్పు, ఒప్పు తెలుస్తున్నాయా? తెలియటం లేదు. అందుచేత మెలకువలో నిద్రపోవడం అభ్యాసం చేయి. నీవు ఆత్మలో నిలకడ చెందినప్పుడు మాత్రమే ఇది సాధ్యమౌతుంది. పరిసరాలను విస్మరించి ఆత్మస్థుడివికా. నీవు ఇతరులకు ఎంతగా చెప్పినా, వారు అవి గ్రహించలేరు. ముందు నీవు మంచిగా ఉంటూ మౌనంగా ఉండు. ఇట్లా మౌనంగా వుండటం చేత, నీ ఇచ్ఛాశక్తి వృద్ధిపొందుతుంది. అప్పుడు ప్రపంచం భగవంతుని రాజ్యంగా విలసిల్లుతుంది. స్వర్గరాజ్యం నీలోనే ఉంది.
-శ్రీ భగవాన్ రమణ మహర్షి””

“మన మనసులోని తలంపులు మనల్ని భయపెట్టేవిగా ఉండవచ్చు. ఒక్కోసారి పరిసరాల నుంచి పారిపోయేలా చేయవచ్చు. నిజానికి అవన్నీ పేక మేడలే. వాటికి బలమైన పునాది అంటూ ఏమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించి, వాటి మీది నుంచి దృష్టిని మరల్చితే వాటంతట అవే కుప్పకూలిపోక తప్పదు.
-శ్రీ భగవాన్ రమణ మహర్షి””

“మానవత్వం ఒక సముద్రం వంటిది. సముద్రంలోని కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవడం పొరపాటు, నమ్మకం వదులుకోవద్దు.
-శ్రీ భగవాన్ రమణ మహర్షి””

నుముని ఎవరు నాశనం చేయలేరు దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుందిఅలాగే మనిషిని కూడా ఎవరు నాశనంచేయరు..! అతని చెడుఆలోచనలే నాశనంచేస్తాయి..! .
-శ్రీ భగవాన్ రమణ మహర్షి””

మీ స్వంత స్వీయ-సాక్షాత్కారమే మీరు ప్రపంచానికి అందించగల గొప్ప సేవ
-శ్రీ భగవాన్ రమణ మహర్షి””

జ్ఞానంతో కూడిన భక్తే నిజమైన శరణాగతి.. జ్ఞానం ఎలా లభిస్తుంది.. తనను తాను విచారించుకోవడం చేత. కనుక సాధన విచారణతో మొదలై సమర్పణతో ముగుస్తుంది.
-శ్రీ భగవాన్ రమణ మహర్షి””

నేను ఎవరు” అనే ప్రశ్నతో ఆత్మ ప్రభోదం చేసిన మహనీయుడు రమణ మహర్షి చిన్న వయస్సులోనే ఇల్లు విడిచి అరుణాచలం వచ్చి తీవ్ర సాధన చేసాడు. రమణుడు కుల మత భేదం లేకుండా. అందరితో పాటు కూర్చోని భోజనం చేశాడు. ఒక రోజు సాయంత్రం బావి దగ్గర ఒక హరిజన భక్తుడు నిలబడి ఉండడం చూసి దగ్గరకు రమ్మని సైగచేసి “ఏది శివ శివ అను” అంటూ మంత్రోపదేశం చేశాడు.

-శ్రీ భగవాన్ రమణ మహర్షి

ర్త (అనగా ఈశ్వరుడు)
వారి వారి ప్రారబ్ధకర్మానుసారంగా జీవులను ఆడిస్తున్నాడు.
జరగనిదానిని ఎవరెంతగా ప్రయత్నించినా సరే జరగనే జరగదు.
జరిగేదానిని ఎవరెంత అడ్డుపెట్టినాసరే జరిగే తీరుతుంది.
ఇది సత్యం.
కనుక మౌనముగా ఉండటమే ఉత్తమం.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

నసు అనేకమైన ఆలోచనలుగా విస్తరించినపుడు, ప్రతి ఆలోచన బలహీనమవుతూ ఉంటుంది.
కానీ ఆలోచనలను నశింపచేయగా చేయగా మనసు ఏకాగ్రమై, దృఢపడుతుంది.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

స్పష్టత లేకుండా మాట్లాడటం కంటే మౌనమే మిన్న

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

నస్సణిగిన గాఢ నిద్రలో అనుభవమవుతున్న తన సహజ స్వరూపం అయిన ఆనందాన్ని పొందాలంటే ఎవ్వరైనా తన ఆత్మను గురించి తెలుసుకోవాలి.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

పవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే, భోజనం చేసి భగవంతుని ధ్యానించడం శ్రేష్టము.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

నీవు స్వేచ్ఛగా చేస్తున్నట్టు కనబడే కర్మవ్యవహారమంతా నిజానికి భగవదాజ్ఞానుసారమే జరుగుతోంది. భగవంతుని చేతిలో నీవొక పనిముట్టుగా ఉండు… ప్రతిదానినీ నా కర్మ, నా ప్రారబ్ధం అంటూ నీ నెత్తిన వేసుకోవద్దు. బాహ్యంలో కర్మాచరణ ఉండాలి. ఆంతరంలో భగవదిచ్ఛ అని ఉండాలి.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

ష్టసుఖాలను సమానంగా అనుభవించినపుడే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

జ్ఞానంతో కూడిన భక్తే నిజమైన శరణాగతి.. జ్ఞానం ఎలా లభిస్తుంది.. తనను తాను విచారించుకోవడం చేత. కనుక సాధన విచారణతో మొదలై సమర్పణతో ముగుస్తుంది.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

నిజానికి ఉన్నది ‘ఆత్మ’ మాత్రమే. ప్రపంచము, జీవాత్మ, భగవంతుడు అన్నీ దానిలోని దృశ్యా

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

లంపులు వచ్చి- పోతుంటాయి. భావాలు వచ్చి పోతుంటాయి. ఎల్లప్పుడూ ఉండేది ఏదో దాన్ని కనుగొనండి.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

నను తాను పాలించుకోలేని వాడు.. ఇతరులను పాలించాలనుకోవడం విచిత్రం.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

నం ఎంత సులభంగా మనలను పొగుడుతారో అంతే సులభంగా నిందిస్తారు కూడా కాబట్టి నింద, పొగడ్తలను పట్టించుకోకుండా శాంతిగా జీవించడానికి ప్రయత్నించాలి

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

ప్రపంచంలో అందరికి వెలుగునిచ్చే సూర్యుడు ఒక్కడే-అలాగే సమస్త జీవులను నడిపించేది ఒక్కటే” ఆ ఒక్కశక్తిని సిద్ధపురుషులు కాళిమాతని,గాయత్రీయని,,పరమేశ్వరుడని, ఆత్మని,పరమాత్మని,దేవుడని$ నేను నని ఇలా వివిధ పేర్లుతో వారి అనుభువానికి తగట్లు

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

కుమ్మరి దుకాణంలో కుండలు, కూజాలు, మూకుళ్ళు మొదలైనవి వేర్వేరు ఆకృతుల్లో వేర్వేరు పరిమాణాలు గలవైవుంటాయి కానీ అవన్నీ ఒకే మట్టితో తయారవుతున్నాయి అలాగే భగవంతుడు ఒక్కడే అయినా వివిధ దేశ కాలాల్లో వివిధ నామరూపాలతో పూజింపబడుతున్నాడు

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

ద్దె ఇంట్లో ఉన్నవాడికి స్వంత ఇంట్లో ఉన్నవాడికి తేడా ఏమంటే,
అద్దె ఇంట్లో ఉన్నవాడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇల్లు ఖాళీ చేస్తాడు.
స్వంత ఇంట్లో ఉన్నవాడు ఒకేసారి ఖాళీ చేస్తాడు.
జ్ఞానికి ఈ శరీరం అద్దె ఇల్లు లాంటిది.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

త్తమ పురుష అయినా లేకుండా మధ్యమ, ప్రథమ, పురుష ఉండవు.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

ముచ్చటగా మూడు ప్రశ్నలు – రమణుల సమాధానాలు
జ్ఞానిని గుర్తించటం ఎలా?
జ్ఞానిని జ్ఞాని మాత్రమే గుర్తించగలడు. ఎవరి సన్నిదిలో అయితే తిరుగుబోతైన మనసు శాంతిని పొందుతుందో వానిని జ్ఞానిగా తలచవచ్చు.
ధ్యానమంటే ఏమిటి?
ధ్యానం అంటే ఒక యుద్ధమని చెప్పాలి. నీవు ధ్యానమని మొదలు పెట్టగానే ఇతర తలంపులన్నీ ఒక్కుమ్మడిగా నిన్ను ముట్టడిస్తున్నాయి. అయితే నీ సత్సంకల్పం క్రమంగా నీలబడి వాటన్నిటినీ పారద్రోలుతుంది.
హానికి అహంకారానికి గల తేడా తెలుపండి?
“నేను – నేను” (అహం-అహం) అనేదే ఆత్మ. “నేను అది”, “నేను ఇది” అని పలికేది అహంకారం. ఇది అది కాకుండా నేనుగా ఉండటమే జ్ఞానం

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

ట్టి కోరిక, సంకల్పం, ప్రయత్నం లేకనే సూర్యుడు ఉదయించును. కేవలం సూర్యుని ఉనికితో సూర్య శిల కాంతిని వెదజల్లును, కమలము వికసించును,నీరు ఆవిరి అగును, లోకులు వివిధములైన కార్యములు నెరవేర్చుకొని విశ్రాంతి పొందుదురు.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

“ఒక భక్తుడు మహర్షికి పదేపదే సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాడు.
మహర్షి : ఎందుకు ఈ కట్టే ముందు ఆ కట్టె ( శరీరం ) పదే పదే పడేయటం; దాని వలన ఏమి ప్రయోజనం . ఈ బాహ్య చర్యల వల్ల ఏమీ ప్రయోజనం లేదు . భక్తి అంతరంగానికి . సంబంధించినది . దానిని ఊరికే బయటికి . వ్యక్తపరచరాదు.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

నందం మీ స్వభావం, దానిని కోరుకోవడం తప్పు కాదు తప్పు ఏమిటంటే, అది మీ లోపల ఉన్నప్పుడు బయట వెతకడం.”

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

నందమే నీ సహజస్వరూపం. నీ శరీరంతో మనసుతో తాదాత్మ్యం చెంది భందాలను నీకు ఆరోహించుకుని ధుఃఖిస్తున్నావు. నీ ఆత్మను తెలుసుకుని నిరతిశయానంద బాంఢాగారపు తలుపులు తెరువు. నిజమైన ఆత్మయే సత్యం

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

నుముని ఎవరు నాశనం చేయలేరు దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది అలాగే మనిషిని కూడా ఎవరు నాశనం చేయరు..! అతని చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి..!

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

గవంతుని ఉనికి చేతనే జీవులు వారి వారి కర్మానుసారం కార్యములు నిర్వర్తించుకొని విశ్రాంతి పొందుతారు. ”

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

‘నేను’ ఎవరు అనే విచారణ అన్ని ఇతర తలంపులను నాశనం చేసి, చితిని రగ్లే కట్టె చివరకు ఆ చితిలోనే పడి నశించే విధంగా, తాను కూడా చివరకు నశిస్తుంది. ”

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

త్మయే జగత్తు; ఆత్మయే ‘నేను’; ఆత్మయ భగవంతుడు; అంతా శివస్వరూపమైన ఆత్మే. ‘ ”

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

న్ని అనుభవాలూ వ్యక్తి చుట్టూనే ఉంటాయి నేను అనే మూలాన్ని కనుక్కోకపోతే దుఃఖం ఎప్పటికీ పోదు

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

ది తప్పనీ, అది ఒప్పనీ విమర్శించవద్దు.
విమర్శల వల్ల ఎవ్వరూ బాగుపడరు.
నీవు గాఢ నిద్రలో ఉన్నప్పుడు తప్పు, ఒప్పు తెలుస్తున్నాయా?
తెలియటం లేదు. అందుచేత మెలకువలో నిద్రపోవడం అభ్యాసం చేయి.
నీవు ఆత్మలో నిలకడ చెందినప్పుడు మాత్రమే ఇది సాధ్యమౌతుంది. పరిసరాలను విస్మరించి ఆత్మస్థుడివికా. నీవు ఇతరులకు ఎంతగా చెప్పినా, వారు అవి గ్రహించలేరు. ముందు నీవు మంచిగా ఉంటూ మౌనంగా ఉండు. ఇట్లా మౌనంగా వుండటం చేత, నీ ఇచ్ఛాశక్తి వృద్ధిపొందుతుంది. అప్పుడు ప్రపంచం భగవంతుని రాజ్యంగా విలసిల్లుతుంది. స్వర్గరాజ్యం నీలోనే ఉంది.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

న మనసులోని తలంపులు మనల్ని భయపెట్టేవిగా ఉండవచ్చు. ఒక్కోసారి పరిసరాల నుంచి పారిపోయేలా చేయవచ్చు. నిజానికి అవన్నీ పేక మేడలే. వాటికి బలమైన పునాది అంటూ ఏమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించి, వాటి మీది నుంచి దృష్టిని మరల్చితే వాటంతట అవే కుప్పకూలిపోక తప్పదు.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

ధ్యానం అంటే ఒక ఆలోచనను అంటిపెట్టుకోవడం . ఆ ఏకచింతన ఇతర తలపులన్నిటినీ దూరం చేస్తుంది . విక్షేపము మనోదౌర్బల్యం తెలుపుతుంది . ధ్యానం వదలకుండా చేస్తే మనస్సు దృఢపడుతుంది . అంటే చలచిత్తము యొక్క దౌర్బల్యం స్థానంలో, భావశూన్య సద్భావ సుస్థితి ఏర్పడుతుంది . .

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

నిషి మనసుకి బానిస మనసు మాయకి బానిస మాయ పరమాత్మకు బానిస కాబట్టి పరమాత్మని పట్టుకుంటే మాయ తొలగుతుంది.
మాయ తొలగితే మనసు నిర్మలమవుతుంది.
మనసు నిర్మలమైతే మనిషి మహర్షి అవుతాడు. చివరికి తానే పరమాత్మ అవుతాడు.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

క భక్తుడు “మీకు కలలొస్తాయా?” అని అడిగాడు. “నిద్రపోతే కదా కలలొస్తాయన్నారు భగవాన్. “అయితే ఎప్పుడూ మేల్కొనే ఉంటారా?” అని అడిగాడు. “నిద్రపోయేవాళ్ళు కదా మేల్కొనేది” అని జవాబిచ్చారు. జాగ్రత్ స్వప్న సుషుప్తావస్థలకు ఆవలిది బ్రాహ్మీస్థితి. అదే జాగ్రత్ సుషుప్తి, భగవాన్ ఎప్పుడూ ఉ౦డేది ఆ స్థితిలోనే, “మీరెప్పుడూ నిద్రపోరని కదా అన్నారు? మీరు గుర్రు పెడుతూంటే విన్నాను” అన్నాడు అప్పుడు అక్కడున్న “నిజమే నేనూ విన్నా’నన్నారు భగవాన్. వారు సాక్షిమాతృలుగా సమస్త భువనాలలోని సకలాన్ని గమనిస్తూనే ఉ౦టారు.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

మానవత్వం ఒక సముద్రం వంటిది. సముద్రంలోని కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవడం పొరపాటు, వదులుకోవద్దు. నమ్మకం

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

“మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా, మీకు ఇష్టంలేని సంఘటనలు జరిగినా ఇది అంతా నీ మనసుకు శిక్షణ ఇవ్వటానికి, శరీరం మరణించిన తరువాత ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చెయ్యటానికి, దానిని పద్ధతిలో పెట్టటానికి భగవంతుడు చేసే సంకల్పమే కాని, నీ మీద ఇష్టం లేక కాదు, నిన్ను బాధపెట్టాలని కాదు. బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను ఇంకా ఎక్కువ పవిత్రం చెయ్యటానికే అలా చేస్తున్నాడు.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

క భక్తురాలు ఇలా అడిగింది
స్వామి ! నేను ఉపవాసాలు చేస్తూ ఉంటాను . విచార సంగ్రహమనే పుస్తకంలో “దేహ పోషణ చేస్తూ వేదాంత విచారం చేసేవాడు, మొసలిని నమ్మి నదిని దాట చూచినట్టు ” అని వుంది. ఇట్లా వుందేమి !
మహర్షి ఇలా సెలవిచ్చారు …..
అట్లా రాశారని, అన్నం తినవద్దు, నీళ్ళు తాగవద్దు అని అర్థం కాదు. శరీరానికి ఉపద్రవము చేసేటట్లు ఉపవాసాలుకాని, ఇంకేమి కానీ చెయ్యకుండా మితంగా భోజనం చేసి, ధ్యాననిష్టకి భంగం లేకుండా సంప్రాప్తమైన ఆహారం తీసుకుని లక్ష్యమంతా దైవంమీద ఉంచమని అర్ధం.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

కర్మలను అనుభవించడం కోసంగా మీకు ఈ శరీరం లభించిందో వాటిని అనుభవించే తీరాలి. వాటిని 00 వదిలి వేయడం అనేది మీ యొక్క ఇష్టా ఇష్టాల మీద ఏ మాత్రము ఆధారపడి ఉండదు. ఏ శక్తి అయితే ఈ శరీరానికి ఉనికి కలిగించిందో, ఆ శక్తే ఈ శరీరం చేయాల్సిన పనులు చేసేలా చూస్తుంది. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నీ పుట్టుక ప్రయోజనం పూర్తి అయ్యే తీరుతుంది.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

“అహంకారమనే ఎండమావిలో సుఖదుఃఖాలు, జనన, మరణాలు మొదలైనవి కెరటాలు.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

గవంతుని ఇచ్ఛకు తల వంచు. నీవు కోరినట్లు చేయవలెననడం శరణాగతి కాదు. నీ ఆజ్ఞలను అతన్ని శిరసావహించమంటూనే, నీవు భగవంతునికి శరణాగతి చేశాననుకోవటమా? అది భగవంతున్ని శాసించడమే. ఏది మంచిదో ఏది ఎప్పుడెట్లు చేయవలెనో ఆయనకు తెలుసు. సర్వమూ సంపూర్ణంగా ఆయనకే వదలివేయి. ఆ భారం అతనిది. నీకేచింతా లేదు. నీ చింతలన్నీ ఆయనవే. శరణాగతి అంటే అది. అదే భక్తి.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

మీరు నిజంగా అన్ని జీవుల పట్ల సమానమైన ప్రేమను అనుభవిస్తున్నప్పుడు, మీ హృదయం మొత్తం సృష్టిని ఆలింగనం చేసుకునేంతగా విస్తరించినప్పుడు, మీరు దీన్ని లేదా దాన్ని వదులుకోవాలని ఖచ్చితంగా భావించరు.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

గవంతుని చూడటం సాధ్యం కాదా?

భగవాన్ రమణ మహర్షి: అవును. – నువ్వు అన్నిటిని చూస్తున్నావు. మరి దైవాన్ని ఎందుకు చూడలేవు? దైవం అంటే ఏంటో ముందు మీరు తెలుసుకోవాలి. అందరూ భగవంతుని ఎల్లప్పుడూ చూస్తున్నారు. కానీ వారికా విషయం తెలీదు. భగవంతుడు అంటే ఏంటో ముందు మీరు తెలుసుకోండి. జనులు చూస్తారు, కానీ చూడరు, ఎందుకంటే వారికి దైవం అంటే ఏంటో తెలీదు.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

“పరిపూర్ణమైన వైరాగ్యము కలిగినప్పుడు మాత్రమే మనసు స్థిరముగా ఉంటుంది”

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

మానవత్వం ఒక సముద్రం వంటిది. సముద్రంలోనికొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవటం పొరపాటు, అందుచేత మానవత్వంపై నమ్మకం వదులుకోవద్దు

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

ముక్తి నీ లోననే ఉన్నది. ముక్తి కోసం నిజంగా అర్హులైన వారిని లోనిగురువు లోనికి లాగుకొంటాడు; వెలుపలి గురువు లోనికి త్రోస్తాడు. గురువు అనుగ్రహం అంటే ఇదే.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

నేను ఎవరు?” అని ప్రశ్నించుకోకుండా గంటలు గంటలు ధ్యానంలో కూర్చోవడం వలన ఏమీ ప్రయోజనం లేదు; పైగా ఈ ధ్యానం వలన ధ్యానించేవాడు అంటే “నేను” మరింత బలపడుతుంది.
“ధ్యానించేది ఎవరు?” అని ప్రశ్నించుకోవటమే సూటిమార్గం.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

దుఃఖం బయట లేదు. నీ లోపల ఉంది. సూటిగా చెప్పాలంటే అది నీ అహంకార రూపంలో ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అహంకార స్వరూపమే దుఃఖం. అసలు నిన్ను నీవు కొన్ని పరిమితులకు కుదించుకుని ఆ పరిమితుల్ని అధిగమించటానికి వేదనాయుతమైన దీర్ఘ జటిల పోరాటం చేస్తావు. అహంకారం వల్లే దుఃఖం వస్తోంది..దుఃఖాన్ని తొలగించడానికి బాహ్యముఖమైన నీ దృష్టిని అంతర్ముఖం పరచాలి. ప్రపంచం భాదలు సత్యం కావు.ప్రపంచంలో వుండే దుఃఖానికి భగవంతుడు కారణం కాదు భగవంతుడు పరిశుద్ధుడు. ఆయన ప్రతిచర్య పరిశుద్ధమైనది.నీవు వాటిని దుఃఖంగా చూస్తున్నావు అది నీ చూపులో, అహంకారంలోవుంది.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

గన్నాటకాన్ని త్యజించి, లోపల ఉన్న ఆత్మను అన్వేషించండి. మీలోనే ఉంటూ, మీకు ఏ ఆపద కలగకుండా సురక్షితంగా ఉండేలా, నేను కాపాడుతాను.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

కోరికలు మితంగా ఉంటే బాధలు తక్కువగానే ఉంటాయి”

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

దేనిని మనస్సు అంటామో అది ఆత్మలోని ఒక అతీంద్రీయ శక్తి. అన్ని తలంపుల పుట్టుకకు కారణం ఇదే.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

శాస్త్రపఠనము, పాండిత్యము, కీర్తి భోగదాయకములే గాని ముముక్షువులకు కావలసిన ముక్తిసాధకమైన చిత్తశాంతికి వినాశకరములే. బియ్యమును గ్రహించి పొట్టును వదలునట్లుగా ముముక్షువు శాస్త్రసారమెరిగి ధ్యానవిరోధమైన వదిలివేయాలి.
పెద్దపెద్ద బీరువాలు నిండుకుని గ్రంథాలుంటాయి. ఎన్నని చదువగలరు. ఎన్నో మతాలు, ఎన్నెన్నో గ్రంథాలు. ఒక్క మతానికి చెందిన గ్రంథాలు చదివేందుకే జీవితకాలం చాలదు. ఇక ఆచరణ ఎప్యుడు? చదివేకొద్దీ చదవాలనే అనిపిస్తుంది. అందుకు గల ఫలితం చదివినవారితో చర్చిస్తూ కాలయాపనం చేయడమే గాని కడతేరనీయవు.

– శ్రీ భగవాన్ రమణ మహర్షి

Similar Posts