మన ఆరోగ్గ్యం దగ్గు నివారణకు(Cough Relief Home Remedies)

  • గ్లాసు నీటిలో అంగుళ అల్లం వేసి మరిగించి తాగాలి. రుచికోసం తేనె కలుపుకోవచ్చు
  • పాలలో మిరియాల పొడి వేసి మరిగించి 2 పూటలా తాగాలి
  • వెల్లుల్లి, తేనె మిశ్రమంలా చేసి రోజుకు 2-3 సార్లు తినాలి
  • పాలలో చిటికెడు పసుపు వేసి 2 పూటలా తాగాలి
  • పొడిదగ్గుంటే వెల్లుల్లి తినాలి
  • గ్లాసు నీటిలో చిటికెడు పసుపు, కొద్దిగా అల్లం రసం కలిపి తాగాలి.
  • గోరువెచ్చని నీరు తాగినా ఫలితం ఉంటుంది
  • దగ్గు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు రోజూ రెండు పూటల గ్లాసు పాలల్లో కాస్త అల్లం లేదు వెల్లులి వేసి మరిగించండి. ఆ తర్వాత పసుపు వేసి గోరువెచ్చగా తాగితే ఉపశమనం ఉంటుంది. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే తగ్గిపోతుంది.
  • పసుపులో కుర్క్యుమిన్ అనే పదార్థం వైరస్,బ్యాక్టీరియా, వాపు వంటి లక్షణాలని తగ్గిస్తుంది. అల్లం, వెల్లుల్లి టాన్సిల్స్ ప్రాంతంలో దిబ్బడను తగ్గించి సహజ నొప్పి నివారుణుల్లా పనిచేస్తాయి.
  • దగ్గు తీవ్రత ఎక్కువగా ఉంటే రోజూ ఉదయాన్నే రెండు చెంచాల తిప్పతీగ రసాన్ని నీటిలో కలిపి తాగండి.
  • తిప్పతీగ రసం రోగనిరోధకశక్తిని పెంచుతుంది, మూడు దోషాలైన – వాత, పిత్త, కఫాల మధ్య సమన్వయం తెస్తుంది.
  • తేనె, యష్టిమధురం పొడి, దాల్చిన చెక్క పొడి నీటిలో కలిపి ఉదయం సాయంత్రం తీసుకున్నా దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.
  • తేనెలో ఉండే డెక్స్ట్రో మెథోర్ఫాన్ వాపులని తగ్గిస్తుంది.
  • దగ్గు మరీ ఎక్కువగా ఉంటే మిరియాల కషాయం తాగండి లేదా అర చెంచా నల్ల మిరియాల పొడిని నెయ్యితో కలిపి కడుపు నిండుగా ఉన్నప్పుడు తినండి.
  • దానిమ్మ రసంలో చిటికెడు అల్లం పొడి, పిప్పాలి పొడిని కలిపి తాగినా దగ్గు తగ్గుతుంది. దానిమ్మలో ఉండే విటమిన్ A, C రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
  • వేడి వేడి మసాలా టీ తాగినా దగ్గు తగ్గుతుంది.

గమనిక : ఈ బ్లాగ్ సైట్ లో అందించిన ఆరోగ్య చిట్కాలు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడ్డాయి మరియు వైద్య సలహా లేదా వృత్తిపరమైన వైద్య నిర్ధారణ, చికిత్స లేదా సలహాకు ప్రత్యామ్నాయంగా భావించకూడదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన డాక్టరు సలహా తీసుకోండి. మీరు ఈ బ్లాగులో చదివిన దాని కారణంగా వృత్తిపరమైన వైద్య సలహాను లేదా దానిని పొందడంలో ఆలస్యం చేయకండి. ఈ బ్లాగ్ సైట్ అందించే ఏదైనా సమాచారంపై ఆధారపడటం పూర్తిగా మీ వ్యత్తిగతం . ఈ బ్లాగ్ సైట్ యొక్క రచయితలు మరియు ప్రచురణకర్తలు ఇక్కడ చర్చించిన ఏవైనా సూచనలు లేదా పద్ధతులను ఉపయోగించడం వల్ల కలిగే ఎటువంటి ప్రతికూల ప్రభావాలు లేదా పర్యవసానాలకు బాధ్యత వహించరు.

Similar Posts