కోటప్పకొండ ఆంధ్ర ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పల్నాడు జిల్లాలో ఉన్న ఒక పవిత్ర కొండ. నరసరావుపేట, చిలకలూరిపేట నగరాలకు 20 కిలోమీటర్లు, గుంటూరు నగరానికి నైరుతి దిశలో 62 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఆలయ చరిత్ర (History in Telugu)

శిలాశాసనాల ప్రకారం ఈ ఆలయం క్రీ.శ.1172 కంటే ముందే ఉనికిలో ఉంది. ఈ ప్రదేశాన్ని పరిపాలించిన అనేక మంది రాజులలో శ్రీ కృష్ణ దేవ రాయలు ఆలయ నిర్వహణ కోసం పెద్ద మొత్తంలో భూములను విరాళంగా ఇచ్చారు. నరసరావుపేట చిలకలూరిపేట, అమరావతి తదితర ప్రాంతాల జమీందార్లు ఆలయ అభివృద్ధికి ఉదారంగా విరాళాలు ఇచ్చారు. కోటప్ప కొండ లేదా కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు, శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం ఎత్తు 600 అడుగులు.

  • చారిత్రక త్రికోటేశ్వర ఆలయం క్రీస్తు శకం 1172 నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళ రాజైన కుళొత్తుంగా చోళరాజు, సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తోంది.
  • నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి, పెట్లూరివారిపాలెం జమిందార్లు అలాగే శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి భూములు సమర్పించారు.
  • భక్తులైన సాలంకులు, అతని ముగ్గురు తమ్ముళ్లు పంచబ్రహ్మ స్థానంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర లింగస్వరూపులు కావటం ఆనందవల్లి (గొల్లభామ) శివైక్య సంధానమవడం ఈ క్షేత్ర వైశిష్ట్యం.
  • బ్రహ్మోపదేశం చేసిన క్షేత్రంగా..: దక్షయజ్ఞం విధ్వంసం తర్వాత శివుడు బ్రహ్మచారిగా చిరుప్రాయపు వటువుగా,  మేధాదక్షిణామూర్తి రూపంలో కోటప్పకొండలో వెలిసినట్లు స్థల పురాణం.
  • దేవతలకు, మహర్షులకు, భక్తులకు బ్రహ్మోపదేశం చేసిన క్షేత్రంగా కూడా గుర్తింపు ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రికూటములుగా వెలసిన త్రికోటేశ్వర స్వామి సన్నిధానమే కోటప్పకొండ.
  • గర్భాలయ దక్షిణద్వారమందు ఉన్న శాసనాల వల్ల సిద్ధమల్లప్ప, శంభుమల్లమ్మలు వేయించిన శాసనాలు ఆలయ ప్రాచీనతను తెలియజేస్తున్నాయి.
  • క్రీస్తు శకం 6, 7శతాబ్దాల్లోనే ఈ ప్రాంతాన్ని ఆనందగోత్రికులు, విష్ణుకుండినులు పాలించి త్రికూటాధిపతులుగా బిరుదులు పొందారు. నిర్మలత్వం,  ప్రశాంతత మూర్తీభవించిన ఓంకార స్వరూపుడు దక్షిణామూర్తి.
  • ఈ స్వామి అనుగ్రహంతో సర్వవిద్యలు లభిస్తాయని ప్రతీతి. దక్షిణాభిముఖంగా ఆశీనుడైన మూర్తి కనుక దక్షిణామూర్తి పేరు సార్థకమైందని చెబుతారు. 200 ఏళ్లకు పూర్వం బ్రహ్మశిఖరంపై పినపాడు వేలేశ్వర అయ్యవారు జనాకర్షణ, మొక్కుబడులు, అష్టదిగ్బంధ గణపతి, సంతాన కోటేశ్వర యంత్రాలు స్థాపించినట్లు శాసన ఆధారాలు ఉన్నాయి.

విష్ణు శిఖరం 

మేధాదక్షిణా మూర్తి వద్ద విష్ణువు కూడా బ్రహ్మోపదేశం పొందినట్లు స్థల పురాణం చెబుతోంది. దీంతో ఇక్కడ విష్ణు శిఖరం ప్రసిద్ధి చెందింది. అయితే పూర్వాశ్రమంలో ప్రజలకు ఇవి తెలియవు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ప్రస్తుత శాసనసభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు కోటప్పకొండకు ఘాట్‌ రోడ్డు నిర్మాణం చేయించారు. ఘాట్‌ రోడ్డులోని రెండు మలుపుల్లో బ్రహ్మదేవుని విగ్రహాన్ని అదే మలుపులో మహావిష్ణువు, లక్ష్మీదేవి, ఆదిశేషుని విగ్రహాలను ఏర్పాటు చేయించారు. కొండపైన భారీ వినాయకుని విగ్రహాన్ని కూడా నిర్మించారు.

బ్రహ్మ శిఖరం 

దక్షయజ్ఞం అనంతరం త్రికోటేశ్వరుడు కోటప్పకొండలో ధ్యానశంకరునిగా, దక్షిణామూర్తిగా వెలిశాడని స్థల పురాణం. ఆయన వద్ద బ్రహ్మ, విష్ణువులు అనేక మంది దేవతలకు ఇక్కడ బ్రహ్మోపదేశం చేశారు. అందువల్లే ఇక్కడ బ్రహ్మశిఖరం ఏర్పాటైంది.

కొండపైకి మార్గాలు

  • దివ్య మహిమ కలిగిన త్రికూటా చలంపైకి చేరడానికి ప్రస్తుతం రెండు మార్గాలు ఉన్నాయి.
  • పాపవినాశన స్వామి దేవస్థానం పడమరగా మెట్ల మార్గం ఒకటి, వాహనాలతో పైకి వెళ్లడానికి వీలుగా ఘాట్‌ రోడ్డు మార్గం మరోటి.

ఘాట్‌ రోడ్డులో పర్యాటకం

  • కొండపైకి వెళ్లే ఘాట్‌ రోడ్డులో ఇంకా అభివృద్ధి చేస్తున్నారు.
  • భారీస్థాయి ఆక్వేరియం ఉంది.నెమళ్లు, కొంగలు, దుప్పులు, జింకలు ఇలా అనేక వన్యప్రాణులు పర్యాటక క్షేత్రంలో ఉన్నాయి.
  • టాయ్‌ట్రైన్‌ ఇది కొండ ప్రాంతంలో నాలుగు కిలోమీటర్ల దూరం తిరుగుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన పిల్లల రాజ్యం నిండా రంగుల రాట్నాలు, రోప్‌వే ఆకర్షిస్తుంటాయి. కాళింది మడుగులో ఏర్పాటు చేసిన బోటు షికారు ప్రత్యేకం.

మూడు కొండలపై వెలసిన ముక్కంటి

దక్షయజ్ఞం అనంతరం ఈశ్వరుడు సతీ వియో గంతో ప్రశాంతత కోసం త్రికూటాద్రి (కోటప్పకొండ) పర్వతం పైన 12 ఏళ్లు వటుడిగా తపమాచరిస్తుం డగా, సదాశివుని అనుగ్రహం కోసం బ్రహ్మ, విష్ణు, సకల దేవతలు, రుషి పుంగవులు స్వామి కటాక్షం కోసం అక్కడ తపమాచరించి ప్రసన్నుడిగా స్వామిని దర్శించుకుని జ్ఞాన దీక్ష పొందారు. అందు వల్లే ఈ క్షేత్రం మహా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. బ్రహ్మ చారి అయిన దక్షణామూర్తి క్షేత్రం కావడంతో ఇక్కడ కళ్యాణోత్సవాలు నిర్వహించారు. ధ్వజ స్తంభం కూడా ఉండదు.

ఎటువైపు చూసినా మూడు శిఖరాలుగా కోటప్పకొండ కన్పిస్తుంది. అందుకే కొండపై వెలసిన స్వామికి త్రికూటేశ్వరుడు అని పేరు వచ్చింది. ఈ మూడు శిఖరాలకు బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలు అని పిలుస్తారు. బ్రహ్మ శిఖరంపై బ్రహ్మ నివసించాడని ప్రతీతి.జ్యోతిర్లింగం ఈ ప్రాంతంలో లేకపోవటంతో బ్రహ్మ ఈశ్వరుని గురించి తపస్సు చేయగా అప్పుడు స్వామి ప్రత్యక్షమై బ్రహ్మ కోరిక తీర్చుటకు జ్యోతిర్లింగంగా వెలిశాడు.జ్యోతిర్లింగమే భక్తుల పూజలందుకుంటున్న కోటేశ్వర లింగం.

జంగం దేవర రూపంలో

కోటప్పకొండ వద్ద ఉన్న కొండకావూరులోని గొల్లభామ ఆనందవల్లి త్రికోటేశ్వరునికి పూజలు చేయగా ఈశ్వరుడు జంగం దేవ రరూపంలో ప్రత్యక్షమైనట్టు స్థల పురాణం చెపుతోంది. ఆనందవల్లి పాప వినాచన దూన వద్దకు వెళ్లి తీర్ధం రుద్ర శిఖరానికి తెచ్చి జంగమయ్యకు అభిషేకాధిపూజలు చేసింది. ఆమెను పరీక్షించేం దుకు ఎన్ని విధాలా కష్ట పెడుతున్నప్పటికీ పూజలు మాననం దునే ఆనందవల్లి ఇంటికి వస్తాను, అక్కడే వ్రతం ఆచరించమని జంగమయ్య ఆమె వెనుకనే బయలుదేరాడు. ఎలాంటి పరిస్థితు ల్లోను వెను దిరిగి చూడవద్దని చెప్పగా ప్రళయ ధ్వనులకు తాళలేక బ్రహ్మశిఖరం వద్ద వెను దిరిగి చూసింది.

జంగమయ్య అక్కడే శిలగా మారాడు. ఆ చోటనే కోటేశ్వరాలయం నిర్మించ బడింది. ఈ ఆలయానికి దిగువ భాగాన గొల్లభామ శిలగా మారిన ప్రాంతంలో ఆనందవల్లి గుడి నిర్మించారు. ఈ గుడిని సాలంకయ్య నిర్మించినట్టు స్థల పురాణం చెపుతుంది. రుద్రశిఖరంపై స్వామి వారు తపమాచరించారు. ఇక్కడే పాత కోటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఆరుద్రోత్సవం సందర్భంగా కర్పూర జ్యోతి దర్శనం జరుగుతుంది. విష్ణుశిఖరంలో దక్ష యజ్ఞంలో పాల్గొన్న దేవతలు, రుషులు పాప విమోచనం పొందిన పవిత్ర స్థలంలో పాప విమోచనేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆరు వందల అడుగుల ఎత్తులో త్రికోటేశ్వర స్వామి దేవాల యం ఉంది. ఘాట్‌ రోడ్డు నిర్మాణంతో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య నానాటికి పెరుగు తోంది.

ఇది దేనికి ప్రసిద్ధి చెందింది:

  • ఆలయం యొక్క భౌగోళిక స్థానం కారణంగా, ఇది ఏ దిక్కు నుండి చూసినా 3 శిఖరాలతో కనిపిస్తుంది, అందుకే త్రికూటపర్వతం దాని పేరులో చేర్చబడింది.
  • 3 కొండలు హిందూ త్రిత్వానికి అంకితం చేయబడినవి కాబట్టి, ప్రతి కొండలో ఒక హిందూ మందిరం ఉంది
  • బ్రహ్మ శిఖరంలో త్రికోటేశ్వరాలయం, రుద్ర శిఖరంలో కోటయ్య ఆలయం, విష్ణు శిఖరంలో పాపనాశేశ్వర ఆలయం ఉన్నాయి. ఈ ఆలయాలన్నీ యాత్రికులు సందర్శిస్తుంటారు.

సందర్శనకు ఉత్తమ సమయం
పవిత్ర ప్రదేశం కావడంతో కోటప్పకొండ త్రికూటపర్వతం ఏడాది పొడవునా దర్శనమిస్తుంది. సమీప ప్రాంతాలు, సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి చేరుకుని శివుడిని, ఇతర దేవతలను పూజిస్తారు. కోటప్పకొండ ఆలయ వైభవాన్ని వీక్షించడానికి ఉత్తమ సమయం ఇక్కడ జరుపుకునే ప్రధాన పండుగ అయిన మహాశివరాత్రి సందర్భంగా.

ఆలయ దర్శనీయవేళలు (Temple Timings)

ఉ||గo 6:00 నుండి మ|| 1:00 గం|| వరకు
సా||గo 3:00 నుండి రాత్రి 8:00 గం|| వరకు

రోజువారీ పూజలు

S. No.సేవ పేరువెలనిర్వహించే ఆర్జిత సేవల సమయాలు
1అర్చన (కొండ) 5.00ఉదయం 06.00 నుంచి 01.00 వరకు మరియు మధ్యాహ్నం 03.00 నుంచి 08.00 గంటల వరకు
2అర్చన (డౌన్ హిల్) 10.00ఉదయం 06.00 నుంచి మధ్యాహ్నం 01.00 వరకు మరియు మధ్యాహ్నం 03.30 నుంచి 06.00 గంటల వరకు
3అష్టోత్తరం 50.00మధ్యాహ్నం 03.00 నుంచి 08.00 వరకు
4పంచహారతి 50.00మధ్యాహ్నం 01.15 నుంచి 01.30 వరకు
5అన్నాప్రసాన 100.00ఉదయం 06.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు
6అభిషేకం 100.00ఉదయం 06.00 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు
7అక్షరాభ్యాసం 100.00ఉదయం 06.00 నుంచి 1.00 వరకు
8హెవీ వెహికల్ పూజ (పైకి) 200.00ఉదయం 06.00 నుంచి 01.00 వరకు మరియు మధ్యాహ్నం 03.00 నుంచి 08.00 గంటల వరకు
9హెవీ వెహికల్ పూజ (డౌన్ హిల్) 200.00ఉదయం 06.00 నుంచి 01.00 వరకు మరియు మధ్యాహ్నం 03.00 నుంచి 06.00 గంటల వరకు
10తేలికపాటి వాహన పూజ (పైకి) 50.00ఉదయం 06.00 నుంచి 01.00 వరకు మరియు మధ్యాహ్నం 03.00 నుంచి 08.00 గంటల వరకు
11తేలికపాటి వాహన పూజ (డౌన్ హిల్) 50.00ఉదయం 06.00 నుంచి 01.00 వరకు మరియు మధ్యాహ్నం 03.00 నుంచి 06.00 గంటల వరకు
12కేశవాఖండన 10.00ఉదయం 06.00 నుంచి సాయంత్రం 06.00 వరకు
13మూలవిరాట్ అభిషేకం 400.00శుభదినాల్లో ఉదయం 05.00 గంటల నుంచి మధ్యాహ్నం 02.00 గంటల వరకు.
14మండప అభిషేకం 150.00శుభదినాల్లో ఉదయం 05.00 గంటల నుంచి మధ్యాహ్నం 02.00 గంటల వరకు.
15
మహాశివరాత్రి పరోక్ష అభిషేక పథకము
 600.00మహాశివరాత్రి పర్వదినమున వారి గోత్రనామములతో అభిషేకము జరుపబడును. మరియు శ్రీ స్వామివారి విశేషప్రసాదము, శేషవస్త్రము, విభూది, గంధము, కుంకుమ, స్వామివారి ఫోటో పోస్టు లేదా కొరియర్ ద్వారా అందజేయబడును.

దేవాలయానికి ఎలా చేరుకోవాలి(How to reach temple)

కోటప్పకొండ త్రికూటపర్వతం కొండ ప్రాంతంలో ఉంది. తరచూ అందుబాటులో ఉండే లోకల్ జీపుల సేవలను అద్దెకు తీసుకోవడం ద్వారా దీన్ని అందుబాటులోకి తీసుకురావచ్చు.

  • సమీప రైల్వే స్టేషను- నరసరావుపేట రైల్వే స్టేషను
  • సమీప విమానాశ్రయం- విజయవాడ విమానాశ్రయం

లొకేషన్ (Location)

Similar Posts