గోవిందనగరి గ్రామంలో సుందరయ్య అనే రైతు కొడుకు రమేశ్, పదో తరగతి చదివేవాడు.

రమేశ్ మంచివాడేకానీ కోపిష్టి. కాకపోతే, ఎంత కొట్లాడినా కోపం దిగి పోగానే క్షమాపణ అడుగు తుండేవాడు.

రమేశ్ రోజూ ఇలా గొడవలు తెస్తుండటంతో రంగయ్య అతణ్ణి గట్టిగా మంద లించాడు.

‘రమేశ్! నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకి ఓ మేకు కొట్టు’ అని చెప్పాడు.

రమేశ్ ఆ తర్వాతి రోజు నుంచే మేకులు కొట్టడం మొదలుపె ట్టాడు.

రానురాను ఆ మేకులతో తలుపంతా అందవిహీనంగా కనిపించసాగింది.

ఓరోజు రంగయ్య రమేశ్కి అది చూపించి ‘ఈ మేకుల్తో తలుపు చూడటానికి అసహ్యంగా ఉంది కదా! నువ్వు కోప్పడేకొద్దీ ఎదుటివాళ్లు కూడా నిన్ను ఇలాగే చూస్తారు…’ అని
చెప్పాడు.

‘అర్థమైంది నాన్నా… నన్ను నేను మార్చుకుంటాను!’ అన్నాడు. అప్పుడు రంగయ్య ‘మంచిదే! నువ్వు కోపాన్ని నిగ్ర హించుకున్న ప్రతిసారీ ఒక్కో మేకును తీసేస్తూ ఉండు’ అన్నాడు.

రమేశ్ అలాగే తీయడం మొదలుపెట్టాడు… అతను మేకుని తొలగించిన ప్రతిచోటా తలుపుపైన ఆ మేరకు చిన్న చిల్లు మిగిలి పోయింది.

రమేశ్ కోపం తగ్గి, మేకులన్నింటినీ తీసేసినా వాటి తాలుకు రంధ్రాలు తలుపునిండా మిగిలిపోయాయి.

అప్పుడు రంగయ్య రమేశ్ భుజం మీద చేయివేసి ‘నువ్వు ఎదుటివాళ్లపైన కోపం చూపినప్పుడల్లా వాళ్ల మనసులో నువ్వు ఓ మేకుని దించినట్టే.

ఆ తర్వాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకుని తీయడం లాంటిది.

నువ్వెంత నిజాయతీగా, శ్రద్ధగా మేకుని తీసినా ఎదుటివాళ్ల మనసుపైన ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది.

కాబట్టి, ఎవర్నీ అనవసరంగా కోప్పడకూడదు..!’ అని చెప్పాడు.

రంగయ్య మాటల్లోని నిజాన్ని గ్రహించిన రమేశ్ మరెప్పుడూ ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు.

Similar Posts