శివానందుడు అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తుండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చి “ఓయి మానవుడా! నేను మిక్కిలి ఆకలిగొని ఉన్నాను. నిన్ను తినేస్తాను” అన్నాడు.
శివానందుడు చేతులు జోడించి “రాక్షసో త్తమా! నేను నా కుమారై వివాహం కోసం ఆభ రణాలు తీసుకుని వెళుతున్నాను. ఇవి ఇంటిలో ఇచ్చి మరల వచ్చి నీకు ఆహారం కాగలను” అన్నాడు, “వెళ్లి త్వరగా రా” అన్నాడు రాక్ష సుడు.
శివానందుడు వేగిరంగా ఇంటికివెళ్లి నగలు తన భార్య చేతికిచ్చి “అమ్మాయి వివాహం చక్కగా జరిపించు. నేను రాక్షసునికి ఆహారంగా వెళుతున్నాను.” అని విషయం వివరించాడు. చాటునుండి ఇది విన్న శివానందుడి తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగుపరు గున రాక్షసుడి వద్దకు వచ్చి “నా తండ్రికి బదు లుగా నన్ను ఆహారంగా స్వీకరించు” అన్నాడు.
అంతలో శివానందుడు వచ్చి కుమారుడిని వదిలివేసి, తనను తినమని అన్నాడు. వీరి ద్దరూ వాదులాడుకుంటూ ఉండగానే దూరం నుంచి కర్ర సాయంతో ఒక వృద్ధుడు వచ్చి “నేను శివానందుడి తండ్రిని. నన్ను తిని వాళ్లను వదిలేయి” అన్నాడు.
అంతలో ఒక ముత్తయిదువ వచ్చి “భర్తనో, కొడుకునో కోల్పోయి నేను జీవించ లేను, నన్ను తిను” అన్నది. ఈ లోగానే ఒక నవజవ్వని వచ్చి “ఈ అనర్థాలకి మూలం నేను. నాకు నగలు తేవడానికి వెళ్లిన తండ్రి నీ కంట పడినాడు. నన్ను తిను” అన్నది.
వారి అనురాగబంధాలు చూసి రాక్షసుని కంట జలజల కన్నీరు వచ్చింది. అంతలో అతను గంధ ర్వుడుగా మారిపోయి “నేనొక గంధర్వుడను. శాపంవల్ల రాక్షసు మారాను. మీవల్ల శాపవిమోచనం జరిగింది కాబట్టి మీకు సకల సిరిసంపదలు ఇస్తు న్నాను తీసుకోండి” అని వారికి కానుకలు ఇచ్చి అదృశ్యమయ్యాడు.

Similar Posts