అనగనగ ఒక ఊళ్ళో ఒక కుక్క తన ఆరు బుజ్జి
కుక్కపిల్లలతో, వాటికి మంచి బుద్దులు నేర్పిస్తూ, హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేది. ఒకరోజు తనపిల్లలతో ఊళ్ళో తిరుగు తుండగా ఒక బావి కనిపించింది. ఆ బావిని చూపించి మీరెవ్వరు ఈ బావి దగ్గరికి వెళ్ళ కండి, చాలా ప్రమాదం, అని చెప్పింది. కుక్కపిల్లలు ఒకరోజు ఆడుతూ ఆడుతూ ఆ బావిదగ్గరికే వచ్చాయి. వాటిలో ఒక బుజ్జికుక్క, అమ్మ ఎందుకలా చెప్పింది? ఇదేమిటో చూడాలి, అనుకుంటూ ఆ బావిలోకి తొంగి చూసింది. బావిలో తన నీడని చూసి, లోపల నిజంగా ఇంకొక కుక్క పిల్ల ఉందని, దానిమీద అరవటం మొదలు పెట్టింది. లోపల ఆ కుక్క ప్రతిబింబం దీనిలాగే అరవటంచూసి దానితో పోట్లాడటానికి బావిలోకి ఒక్క దూకు దూకింది. ఇంకేముంది, కుక్కనీళ్ళల్లో పడి కొట్టుకుంటూ పెద్దగా రక్షించండి అని అరవటం మొదలుబెట్టింది. ఆదారినే వెడుతున్న ఒకరైతు, అయ్యో! కుక్క నీళ్ళల్లో పడిపోయిందే పాపం, అని దాన్ని బయటికి తీసి రక్షించాడు.
నీతి: పెద్దలు చెప్పిన మాటలు వినాలి. కావాలంటే ప్రశ్నించ వచ్చు కానీ ఎపుడు ధిక్కరించ గూడదు.

Similar Posts