ద్వారకాతిరుమల

ద్వారకాతిరుమల(Dwarakatirumala) చరిత్ర

త్రేతాయుగంలో ద్వారకామహర్షి శ్రీవారి శేషాచ లకొండపై తపస్సు చేయగా తపస్సుకి మెచ్చి శ్రీమ హావిష్ణువు తన పాదాలను ద్వారకా మహర్షికి ఇచ్చారు. దీంతో ఈ క్షేత్రానికి ద్వారకాతిరుమల అనే పేరువచ్చింది. ఈ ఆలయంలో స్వయంచకుడైన శ్రీవారి పాదాలు వల్మీకం ( పుట్టమన్ను)లో ఉండ డంతో భక్తులకు శ్రీవారిపాదపూజ చేసేందుకు వైఖానస ఆగమశాస్త్రానుసారం పెద్దతిరుపతి నుంచి ప్రతిష్ఠస్వామిని తీసుకొచ్చారు. దీంతో ఒకే అంతరా లయంలో ఇద్దరు ధ్రువమూర్తులు ఉండడం ఈ క్షేత్రం ప్రత్యేకత. అలాగే ఎక్కడా లేనివిధంగా స్వామివారు దక్షిణాభిముఖంగా ఉండటం కూడా ఇక్కడి మరో ప్రత్యేకత మెక్కుబడుల నిమిత్తం పెద్దతిరుపతి వెళ్లలేని భక్తులు ద్వారకాతిరుమల శ్రీవారిసన్నిధిలో మొక్కుబడులు సమర్పించే సంప్ర దాయం ఇక్కడుంది. ఒకే విమానమందు ఇద్దరు ధ్రువమూర్తులు ఉండడంతో బ్రహ్మోత్సవాలు సంవ త్సరానికి రెండుసార్లు జరుగుతున్నాయి. స్వయంవ్యక్తుడైన స్వామివారికి ఆశ్వయుజ మాసం లోను ప్రతిష్టస్వామివారికి వైశాఖమాసంలోనూ ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.

ఇలా రావచ్చు

ద్వారకాతిరుమల(Dwarakatirumala) క్షేత్రానికి చెన్నై నుంచి కల కత్తా వెళ్లే రైలుమార్గాన ఏలూరుకి 11 కిలోమీ టర్లు దూరంలో ఉంది. భీమడోలుకి 17 కిలోమీ టర్లు, చెన్నై నుంచి కలకత్తా వెళ్లే రోడ్డుమార్గాన భీమడోలు ఆంక్షను నుంచి 15 కిలోమీటర్లు ఉంది. ద్వారకా తిరుమలకు ప్రతిరోజు ఏలూరు, తాడేపల్లిగూడెం, నర్సాపురం, తణుకు, జంగారెడ్డి గూడెం, సత్తుపల్లి, భీమవరం, భద్రాచలం, ఉయ్యూరు, విజయవాడ, గన్నవరం, గుడివాడ. మచిలీపట్నం డిపోల నుంచి ఆర్టీసీబస్సులను నడుపుతోంది. అలాగే పర్యాటక శాఖ హైదరా బాదు నుంచి హైటెక్ బస్సు నడుపుతోంది.

ఇక్కడ బసచేయవచ్చు

శ్రీవారి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం పలు సత్రాలను దేవస్థానం నిర్మించింది. నూతనంగా శేషాచలకొండపై 120 గదుల సత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఇది భక్తులకు అందుబాటులోకి వచ్చింది. అలాగే గ్రామంలో చిన్నాయమ్మారావు సత్రం, ఆళ్వార్ సత్రం, టిటీడీ సత్రం, మావులేటి సోమరాజు సత్రం, దేవస్థానం భక్తుల కోసం నిర్మించింది. కొండపైన డార్మెటరీ నిర్మించి కేవలం 10 రూపాయలకే భక్తులకు వసతిని కల్పించారు. అలాగే క్షేత్రంలో ప్రయివేటు సత్రాలు అనేకం ఉన్నాయి. ద్వారకాతిరుమలలోని ఉపాలయాలను భక్తులు దర్శించే నిమిత్తం ఆలయం ఉచిత బస్సుని కూడా ఏర్పాటు చేసింది. భక్తులకు మెరుగైన సేవలందించేందుకు కొండవైన అనేక అతిథి గృహాలున్నాయి. పర్యాటకశాఖవారు పున్నమి హోటల్ ని నిర్మించారు. •

Similar Posts